తెలుగు సినిమాల్లో ఓ బోల్డ్‌ అటెంప్ట్‌

adith arun
adith arun, actor

కథ, తుంగభద్ర, పిఎస్వీ గరుగ వేగా, 24 కిస్సెస్‌ లాంటి విభిన్న కథా కథనాలతో రూపొందిన చిత్రాలకు ప్రాధాన్యమిస్తూ, తన నటన ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో ఆదిత్‌ అరుణ్‌.. ఇటీవల బ్లూ ఘోస్ట్‌ పిక్చర్స్‌ బేనర్‌పై సంతోష్‌ పి జయకుమార్‌ దర్శకత్వంలో అడల్ట్‌ హారర్‌ కామెడీగా రూపొందిన చిత్రం ‘చీకటి గదిలో చితకొట్టుడు.. సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.. మే 21న ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం విడుదల అవుతున్న సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ..

ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్‌ అయ్యింది?
నేను నా కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి తెలుగు, తమిళ మూవీస్‌ చేస్తూ వస్తున్నా.. అయితే నేను గరుడవేగా చేస్తున సమయంలో ఒక రోజు ఫ్లైట్‌లో జ్ఞానవేల్‌గారు కలిసి ఈసినిమాలో కొనఇన పిక్స్‌ చూపించి ఈసినిమాను చేను చేద్దాం అనుకుంటున్నాను. మీరు నటిస్తారా? అని అడిగారు.. నేను చూసి నటిస్తాను సార్‌ అని చెప్పా..నేను తెలుగులో 24 కిస్సెస్‌ చేస్తుండటంతో ఆసినిమాను తమిళంలో వేరే నటీనటులతో చేయటం జరిగింది.. అయితే ఆసినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తాను అని అనటంతో ఈ ప్రాజెక్టు ఓకే అయ్యింది..

విభిన్న చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు?
రెగ్యులర్‌ ప్యాట్రర్న్‌లో సినిమా చేయను..కాబట్టి నేను నా ప్రతి సినిమాను భయపడుతూనే చేస్తాను.నా సినిమాలు 24 కిస్సెస్‌ కానివ్వండి.. ఎల్‌ 7 కానివ్వండి..కథా సినిమా కానివ్వండి..అన్ని డిఫరెంట్‌ స్టోరీస్‌ కే మొగ్గు చూపి ఎడ్వెంచరస్‌ మూవీస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను.

తెలుగులో ఇది బోల్డ్‌ అటెంప్ట్‌ కథా.. ఎలా అన్పిస్తుంది?
మనం సినిమా చూసి నిజంగా నవ్వుకుని తర్వాత కూడ మాట్లాడుకునే సినిమాల్లో అప్పుల అప్పారావు. కానీ జంబలకిడి పంబ సినిమా తప్పకుండా ఉటుంది..అంటే సినిమా ప్రేక్షకులకు, ఎంటర్‌టైన్‌ చేయగలిగితే వారు ఏ జోనర్‌లో అయినా చూస్తారు.. అన్నదానికి చాలా ఉదాహరణలున్నాయి.. అయితే తమిళంలో పరిస్థితి మరోలా ఉంటుంది..వారికి డిఫరెంట్‌ స్టోరీ అయితేనే వారు చూస్తారు. తెలుగులో అలా కాదు. మనం ఈజోనర్‌లో అయినా చేయవచ్చు. కానీ అది ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్‌టైన్‌ చేయగలగాలి.. అపుడే వారు చూస్తారు..అందుకే ఈసినిమా విజయం పట్ల మా టీం చాలా కాన్ఫిడెంట్‌తో ఉంది.

సినిమా స్టోరీ లైన్‌?
ఈసినిమాలో నా క్యారెక్టర్‌ పేరు చందు.. పెళ్లి కోసం అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది.. అయితే ఒకరిని ఒకరు బాగా తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంట.. మంచిదని నమ్మి తాను పెట్టే షరతులతో ఆ అబ్బాయి ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు..అనేది స్టోరీ లైన్‌.. ఈస్టోరీ లైన్‌ను డైరెక్టర్‌ పూర్తి ఎంటర్‌టైన్‌మ్ట్‌ెంవేలో చెప్పటం జరిగింది..

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
సినిమాలో మనం ఏం చెప్పదలుచుకున్నామో.అదే టైటిల్‌గా పెడిగే బాగుంటుంది అనేది నా అభిప్రాయం..అందుకే తమిళ్‌లో ఈసినిమా పేరు ఇరుటారియల్‌ మొరటు కుత్తు..ఈ టైటిల్‌కు తెలుగు ట్రాన్స్‌లేషన్‌ చీకటి గదిలో చితక్కొట్టుడు..
ఒక పెద్ద డైరెక్టర్‌ సజెస్ట్‌ చేయటం జరిగింది.. ఈసినిమాలో స్కిన్‌షోగానీ లిపలాక్‌లు కానీ అస్సలు ఉండవు.. అన్ని స్టాండర్డ్స్‌కి లోబడే సినిమాను తీయటం జరిగింది..సినిమా ఫస్ట్‌ సీన్‌ నుంచి లాస్ట్‌ సీన్‌ వరకు ఆడియెన్స్‌ నవ్వుతూనే ఉంటారు.

ఎన్నిరోజులు షూట్‌ చేశారు?
ఈసినిమా ఆల్‌రెడీ తమిళ్‌లో విడుదలై సూపర్‌హిట్‌ కలెక్షన్లు సాధించింది. అందుకే అదే స్టోరీతో నా కెరీర్‌లో అతి తక్కువ సమయంలో కంప్లీట్‌ చేసిన సినిమా ఇదే..ఈచిత్రానికి నేను కేవలం 19 రోజులు మాత్రమే తీసుకున్నాను..

ఈసినిమా చేయటానికి గల కారణం?
చాలా మంది ఈసినిమా డబ్బులు కోసం చేశావా..అని అడుగుతున్నారు. మనీ కోసం కాదు సినిమా స్టోరీ బాగా నచ్చింది.. ఈచిత్రం చేస్తున్నపుడు జెన్యూన్‌గా బాగా ఎంజా§్‌ు చేశా.. నేను ఒక కాంపిటీషన్‌ను కానీ ఇక్కడ ఎవ్వరితో కాంపిటీషన్‌ కోసం నేను రాలేదు.నాకు నచ్చిన సినిమాను ఎంజా§్‌ు చేస్తూ చేయాలి అనేది నా పాలసీ..

మీ తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం కొలంబస్‌ సినిమా ఫేం రమేష్‌ సామలతో డ్యూడ్‌ అనే చిత్రాన్ని చేస్తున్నాను.. ఫ్రెండ్షిప్‌ నేపథ్యంలో ఉంటుంది.. ఈసినిమాలో నాతోపాటు ప్రిన్స్‌, ప్రియదర్శి కూడ నటిస్తున్నాను.. సినిమాషూటింగ్‌ సగభాగం పూర్తయింది.. ఇది కొక మరో రెండు చిత్రాలకు సైన్‌ చేశాను.. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను…