తెలుగు సినిమాలకే ప్రాధాన్యత: దీప్‌ పథక్‌

DEEPAK
DEEPAK

తెలుగు సినిమాలకే ప్రాధాన్యత: దీప్‌ పథక్‌

అవికా గోర్‌, ఇషా డియోల్‌, దీప్‌ పథక్‌, ప్రధాన పాత్రల్లో కిషన్‌ శ్రీకాంత్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మాంజ. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ సంధర్భంగా.. దీప్‌ పథక్‌ విలేకర్లతో ముచ్చటించారు. నేను పుట్టి, పెరిగింది ఢిల్లీలో.. థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్స్‌ చేశాను. ఈ సినిమాలో ఆడిషన్స్‌ చేసి హీరోగా ఎంపిక చేశారు. కన్నడలో ఈ సినిమా పెద్ద హిట్‌ అయింది. అలానే తెలుగులో కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నలుగురు బాలలు అనుకోకుండా ఓ నేరం చేస్తారు. వారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. వారితో మరిన్ని నేరాలు చేయిస్తుంటారు. వారి నుండి ఈ నలుగురు ఎలా తప్పించుకున్నారో అనే అంశాలతో సినిమా నడుస్తుంది. పూర్తి సందేసాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమాలో నేను ఓ కార్‌ మెకానిక్‌ గా కనిపిస్తాను. రఫ్‌ గా ఉండే క్యారెక్టర్‌. కానీ బయట నేను చాలా జోవియల్‌ గా ఉంటాను. కిషన్‌ వయసులో చిన్నవాడైనా.. సినిమా బాగా చేశాడు. తెలుగు ప్రేక్షకులు నటీనటులను ప్రేమిస్తారు. కొత్తవారిని కూడా బాగా ఆదరిస్తారు. నాకు తెలుగులో హీరోగా రాణించి మంచి పేరు తెచ్చుకోవాలనుంది. తెలుగు సినిమా పరిశ్రమలోని వారు ఎ0తో లవ్లీ గా ఉ0టారు, ఇకము0దు చేయబోయే చిత్రాలలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నాను. ప్రస్తుతం రెండు కొత్త ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నాయి అని చెప్పారు.