తెలుగు వారి ఆత్మగౌరవాన్ని లోక్‌సభలో తాకట్టు

purandeswari
purandeswari

అమరావతి: ఆంధ్రాకు అసలైన ద్రోహులెవరో నిన్నటితో తేలిపోయిందని బిజెపి నేత పురంధేశ్వరి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ మద్దతుతో టిడిపి అవిశ్వాసం పెట్టడం బాధాకరమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని లోక్‌సభలో తాకట్టుపెట్టారని విమర్శించారు. ఏపి ఏది అడిగినా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. చంద్రబాబు లేఖ ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. దుగరాజపట్నం పోర్టు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని పురంధేశ్వరి ఆరోపించారు.