తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ రగడ

Power Generation
Power Generation

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ రగడ

రూ. 6337 కోట్లు తెలంగాణ చెల్లించాలి
బకాయిల కోసం ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసిన ఎపి
అలాంటి నోటీసు అందలేదన్న తెలంగాణ

కోనేటి రంగయ్య / హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల ఏర్పాటు జరిగిన దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తుండగా, ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పలు వివా దాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ, ఎపి లమధ్య నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి కేంద్రం తగిన చొరవ తీసుకోవడం లేదనికూడా ఎపి ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

ఇందులో భాగంగా తెలంగాణ డిస్కంలకు చేసిన విద్యుత్‌ సరఫరాకు గానూ మొత్తంగా 6337 కోట్ల రూపాయలు ఎపికి చెల్లించాల్సి ఉండగా, ఇప్పటిరకు ఈ మొత్తాలను చెల్లించలేదని దీంతో తాము న్యాపరమైన చర్యకు పూనుకున్నా, కేంద్రం ఈ విషయంలో జోక్యంచేసుకోవడం లేదని వాదిస్తున్నది. అయితే తెలంగాణ ఈ వాదనను అంగీకరించడం లేదు. ఎపి ప్రభుత్వం అంతా తనకు అనుకూలమైన వాదన చేస్తూ తెలంగాణను అన్యాయంగా బిల్లులు చెల్లించాలని కోరుతున్నదని, తాము కూడా ఇదే వాదనను న్యాయ పరంగానే ఎదుర్కొంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది. ఈ బకాయిలపై ఎపి జెన్‌కో గత ఏడాది నవంబర్‌ 10 న నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. ముందుగా కేంద్ర ఇంధన శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలకు ఈ విషయం సెప్టెంబర్‌ 19,2016 న ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడం వల్లనే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లుగా ఎపి ప్రభుత్వం వెల్లడి స్తున్నది.

కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ మేరకు తెలంగాణ డిస్కంల నుంచి బకాయిలు ఇప్పించడంలో సకాలంలో చర్యలు తీసుకోలేదనేది ఎపి వాదన. ఎపి జెన్‌కో జూన్‌ 2017 వరకు తెలంగాణ డిస్కంలకు చేసిన విద్యుత్‌ సరఫరా మేరకు రూ. 5732 కోట్ల 40లక్షల మొత్తానికి తోడు అపరాద రుసుం 604 కోట్ల 70 లక్షలను కలుపుకొని దాదాపు 6337 కోట్ల పది లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉందని ఎపి కోరుతున్నది. విద్యుత్‌ సరఫరా కు సంబంధించిన ఎపి వాదనను తెలంగాణ తిరస్కరిస్తున్నది. తెలంగాణ డిస్కంలకు విద్యుత్‌ సరఫరా చేసినందుకు అదనంగా చెల్లింపుల కోసం ఎపి కోరుతున్న విషయం ఎలా ఉన్నా, ఈ మేరకు ట్రిబ్యునల్‌ నుంచి కానీ ఇతరత్రా ఎవరి నుంచి కానీ తమకు ఎలాంటి నోటీసు రాలేదని, నోటీసులు అందితే తమ జవాబు కూడా కూడా సహేతుకంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది. విభజన చట్టం ప్రకారం విద్యుత్‌ వినియోగం ప్రాతిపదికగా తెలంగాణకు విదుత్‌ కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే. బోరు బావులు అధికంగా ఉన్నందున తెలం గాణలో సహజంగానే విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటుంది. జనాభా ప్రాతిపదికగా అంటూ కొన్ని కేటాయింపులు, వినియోగం అంటూ వేరువేరు ప్రాతిపదికలుండటంలో రెండు రాష్ట్రాలు కూడా తమకు ఏ ప్రాతిపదికతో లాభం ఏది కాదనే విధంగా వాదనలు చేస్తున్నాయి.

దీంతోఉద్యోగాల విషయంలో సమస్య చాలా వరకు కొలిక్కి వచ్చినప్పటికీ ఆస్తులు, బకాయిల విషయంలోనే వివాదాలు కొనసాగుతున్నాయి. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయా సమస్యల పరిష్కారానికి నాలుగేళ్లుగా కృషి జరుగుతున్నా, రెండు రాఫ్ట్రాల మధ్య ఇంకా అనేక వివాదాలున్నాయి. ఉద్యోగులు విభజనకు సంబంధించి ఇప్పటికే చాలావరకు సమస్యలు పరిష్కారమయ్యాయి. కానీ డిఎస్‌పిలు, ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్‌, కొద్ది మంది డాక్టర్ల విషయంలో మాత్రమే విభజన ప్రక్రియలో జాప్య ంజరుగుతున్నది. ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులుఅప్పుల పంపిణీకి సంబంధించి రిటైర్డు ఐఎఎస్‌ అధికారి డాక్టర్‌ షీలాబిడే నేతృత్వంలో నిపుణుల కమటినీ 2014 మే 30 న ఏర్పాటు చేసి కేవలం ఆరు నెలల కాలంలోనే తగిన సిఫారసులు ఇవ్వాలని ఆదేశించారు. అయితే వివాదాలు కొనసాగుతున్నందన ఈ కమిటీ కాలపరిమితిని పలుసార్లు పొడిగిస్తూ వస్తున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్స్‌ 9, 10 విషయంలో వివాదాల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. తొమ్మిదో షెడ్యూలులో ఉన్న 89 పబ్లిక్‌ రంగ సంస్థల ఆస్తుల పంపకంలో ఏకాభిప్రాయం కుదరడటం లేదు. ఆయా సంస్థలు ఎక్కడ ఉంటే అక్కడి రాష్ట్రానికి వాటి ఆస్తులు అప్పగించేలా స్థూలంగా తీసుకున్న నిర్ణయానికి ఎపి ప్రభుత్వంససేమిరా అంటు న్నది.

కమిటీఇప్పటివరకు 49 సంస్థలకు సంబం ధించి ఆస్తులు-అప్పుల పంపిణీతోపాటు ఉద్యో గుల విభజనకు సంబంధించిన సిఫారసులు అందించగా అందులో కేవలం 33 సంస్థలకు చెందిన సిఫారసులపై అంగీకారం తెలిపి, ఎపి ప్రభుతవం జిఒలు జారీ చేసింది.ఇక పదో షెడ్యూల్‌లోని సంస్థల విషయంలోనూ ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలమధ్య ఏకాభిప్రాయం రాలేదు. పదో షెడ్యూల్‌లో 142 సంస్థలుండగా అందులో 123 సంస్థలు హైదరాబాద్‌లో లేదా ఈ నగరం చుట్టుపక్కల ఉన్నాయి. అయితే ఈ సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన జనాభా ప్రాతిపదికగానే జరగాలని ఎపి ప్రభుత్వం వాదిస్తున్నది.ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో కమిటీల నిర్ణయాలు, కోర్టుకేసులు, కేంద్ర ప్రభుత్వ ఉత్త ర్వులు ఎలా ఉన్నా అన్ని పెండింగ్‌లోనే పడిపోతున్నాయి. విభజన పంచాయితీ చట్ట ప్రకారం విభజన జరిగినప్పటికీ ఆయా అంశాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా సమన్వయం కుదరడం లేదు.అయితే తెలంగాణతో పంచాయతీ కంటే ఇరు రాష్ట్రాలను సముదాయించాల్సిన కేంద్రంకేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం, ప్రధానపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్రుగా ఉండటం గమ నార్హం.

తాజాగా ఇదే వివాదం ఎపిలో కనిపిస్తు న్నది. ప్రత్యేక హోదాకోసం వైఎస్‌ఆర్‌సి పెద్ద యెత్తున ఒత్తిడి పెంచుతున్నది. ఈ మేరకు ఏప్రిల్‌ 6న వైఎస్‌ఆర్‌సి పార్లమెంట్‌ సభ్యులు రాజీనామా ప్రకటించారు. అయితే హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇతర ప్రకటనల ప్రకారం ఎపికి రావాల్సిన అన్ని హామీలు నెరవేర్చాల్సిందేనని ఎపి ముఖ్యమంత్రి గట్టిగానే బిజెపిని కోరు తున్నారు. ఒక ఎపి కాంగ్రెస్‌ కమిటీ మరింత దూరం వెళ్లి ఎపి సమస్యలపై పార్లమెంట్‌ వేధికగా చర్చ జరిగేందుకు పార్టీ ఎపి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఒప్పించారు. ఇదే విధమైన సవాల్‌ను విసిరిన వైఎస్‌ఆర్‌సి నేత జగన్‌కూడా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్‌ చేశారు. దీనికితోడు చంద్రబాబును ఒప్పించాలని జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ను కూడా సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి పవన్‌ ఈ సవాల్‌ను స్వీకరిస్తూ ముందుగా వైఎస్‌ఆర్‌సి అవిశ్వాసం ప్రతిపాదిస్తే తాను మద్దతు ఇస్తానని సుముఖత వ్యక్తం చేశారు. ప్రతి సవాల్‌ చేయడంతోపాటు పవన్‌ తీర్మానానికి అవసరమైన ఇతర ఎంపీల మద్దతును తాను కూడగడతానని తెలిపారు.

ఇక ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు కూడా తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తుందని హెచ్చరించారు. రాష్ట్రప్రయోజనాల కోసం కలిసి వచ్చే పార్టీల తోడ్పాటుతో కేంద్రంపై తాము ధ్వజమెత్తుతామని చంద్రబాబు కూడా వెల్లడించడంతో పరిస్థితి అసక్తికరంగా మారింది. ఎపిలోని దాదాపు అన్ని పార్టీలు అవిశ్వాసం కోసం సిద్ధమయ్యాయి. మొత్తం 25 మంది ఎపి లోక్‌సభసభ్యులుతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ సభ్యులు నలభై మంది, సిపిఎం, సిపిఐ,ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుందని, దీంతో సభలో చర్చ రంజుగా జరిగే అవకాశాలుం టాయి. విభజన తర్వాత తెలంగాణ, ఎపికి కూడా కేంద్రంనుంచి ఆశించిన స్థాయిలో ప్రయో జనం కలుగలేదు. నియోజక వర్గాల పెంపుపై కలిసి రానున్న టిఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్ర సమితి కూడా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఈ చర్చలో భాగం పంచుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. నియోజక వర్గాల పెంపుదలకు సంబంధించి విభజన చట్టంలో స్పష్టంగా ఉంది.

ఈ విషయంలో టిఆర్‌ఎస్‌తోపాటు టిడిపి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎన్ని కల్లో ప్రయోజనం పొందడానికి ఇది ఆ రెండు అధికార పార్టీలకు అవసరం. ఇతర పార్టీ నుంచి ఈరెండు అధికార పార్టీల్లోకి పిరాయించిన వారికి తిరిగి టికెట్టు ఇవ్వాలంటే కొత్తగా కొందరికి అవకాశాలు దక్కాలంటే ఆ పార్టీలకు అదనంగా నియోజక వర్గాలు కావాలి. దీంతో పార్లమెంట్‌లో జరిగే చర్చలో టిఆర్‌ఎస్‌ కూడా పాలుపంచుకొని నియోజక వర్గాల పెంపుపై ఒత్తిడిపెంచే అవకాశా లున్నాయి. విభజన చట్టంలోని ఈ కీలక అంశాన్ని మరోసారి రాజ్యాంగ సవరణ తప్పని సరి అని కేంద్రం దాటవేస్తున్న విషయం తెలిసిందే. ఇతర అనేక విషయాలతోపాటు మరి కొన్ని అంశాలు అటు ఎపికి, ఇటు తెలంగాణకు అవసరమవుతాయి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఈ చట్టప్రకారం అందించాల్సిన నిధుల విషయంలోనూ కేంద్రం తాత్సార్యం చేస్తున్నది.

దీనిపై కూడా రెండు రాష్ట్రాల అధికార పార్టీలు పార్లమెంట్‌లో ప్రస్తావించే అవకాశాలుంటాయి. ఈ మేరకు సహరించే వీలుంటుందని భావిస్తున్నారు. కాగా పవన్‌ కళ్యాణ్‌ ఎపి కవితకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎపికి తీరని అన్యాయం విభజన చట్టంలోని పలు వ్యవహారాల్లో ఎపికి అన్యాయం జరుగుతున్నదని ఎపి ప్రభుత్వం పవన్‌ నేతృత్వంలో ఉన్న కమిటీకి ఇచ్చిన 118 పేజీల నివేధికలో కేంద్రం తమకు సహక రించడం లేదని ఏఏ అంశాల్లో కేంద్ర సహకారం లభించడం లేదో ప్రభుత్వ పరంగా అందించడం గమనార్హం.

అందులో ప్రస్తావించిన పలు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. విద్యుత్‌ బకా యిలతోపాటు ఇతర విషయాలను అందులో వివరించారు. విభజన సమయంలో తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌లకు ఆస్తులు, అప్పులు, ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ఏప్రాతిపదికపై పంపిణీ చేయాలనేది చట్టంలోనే ప్రతిపాదిం చారు. అయితే కొన్నివిషయాల్లో ఈ ప్రాతిపాదిక లను తమ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతూ ఎపి విభేదిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ సమైఖ్య రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రకారం కాకుండా ఇతరత్రాప్రాతిపదికలు తీసుకోవడం వల్ల ఎపికి నష్టం జరిగిందని దీనిని పూడ్చటానికి కేంద్రం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదనేది ఎపి ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఎపి జనాభా 58 శాతం ఉండగా అంచనా వ్యయంలో 46 శాతం మాత్రమే ఎపికి ఇవ్వడంలోని ఔచిత్యాన్ని ఎపి ప్రశ్నించింది.

కాగా ఆస్తుల పంపిణీ కూడా ఆయా సంస్థలకు చెందిన ఆస్తులు ఎక్కడ ఉంటే అదే రాష్ట్రానికి అవి చెందుతాయనే క్లాజ్‌ను కూడా ఎపి అంగీకరించడం లేదు. ఇక రుణాలు అంటే అప్పులు పంపిణీ జనాభా దామాషాలో నిర్ణయించడాన్ని కూడా ఎపి వ్యతిరేకిస్తున్నది. విద్యుత్‌ కేటాయింపులు ఏ రాష్ట్రంలో ఎంత వినియోగం అవుతున్నదో పరిశీలించిన ఈ ప్రాతిపదికను నిర్థారించడం పట్ల ఎపి సుముఖత వ్యక్తం చేయడం లేదు.టాక్స్‌లను తిరిగి చెలించే ప్రాతిపదికను ఎపికి 58.32 శాతం, తెలంగాణకు 41.68 శాతం అంటే జనాభా ప్రాతిపదకను పాటించడంతోపాటు, డిఫరుడ్‌ టాక్స్‌ కలెక్షన్ల వల్ల కూడా ఎపికి నష్టం భారీగా ఉందని వాదిస్తున్నది.

ఈ మేరకు 3,800 కోట్ల రూపాయల నష్టంఎపికి జరుగుతున్నదని ఇప్పటికే ఎపి ప్రకటించింది.షెడ్యూల్‌ 9 లోని సింగరేణి కంపెనీ తెలంగాణలో ఉన్నందున దానిలో 51 శాతం వాటాలను తెలంగాణకు కేటాయించారు. కానీ సింగరేణి అనుబంద సంస్థ అయిన ఎపిహెచ్‌ఎఇఎల్‌ ఎపిలో ఉన్నప్పటికీ ఇలాంటి సదుపాయం లభఙంచలేదని, ఇదికూడా షెడ్యూల్‌ 9 కింద ఉన్న కంపెనీ అని ఎపి చెబుతున్నది. విభజన తర్వాత ఎపికి 1,30,000 కోట్ల రూపాయల రుణాలను ఎపి ఖాతాలో వేశారిని, ఇది నిష్పత్తి కంటే 24 వే ల కోట్లు అధికమని ఎపి చెబుతున్నది. ఈ మేరకు వడ్డీల చెల్లింపు అధికంగా ఉండి ఎపి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్నదని, ఇక రిటైర్డు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్‌ భారం కూడా ఎపికే అధికంగా ఉందని ప్రభుత్వ పరంగా గణాంకాలను ఏకరువుపెట్టారు. ఇతర సమస్యలు కూడా అధికంగా ఉన్నాయని, కేంద్ర ప్రభు త్వంలో భాగస్వామిగా, బిజెపికి మిత్రపక్షంగా తామున్నా ఎపి ప్రయోజనాలను పరిరక్షించ డంలో కేంద్రం విఫలమవుతున్నదనే ఆందోళనను ఎపి వ్యక్తం చేస్తున్నది.