తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Jagan
Jagan

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి ఏపి ప్రతిపక్షనేత, వైఎస్సార్సీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 తెలుగు ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ది కలుగాలని వైఎస్‌ జగన్‌ ఆక్షాంక్షించార. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రతిక ప్రకటన విడుదల చేసింది. ఈ యేడాది ఏపి ప్రజల జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని ఆయన కోరుకున్నారు. ఈ నూతన సంవత్సరం ఏపిలో సుపరిపాలన అందుతుందని, విలువలు లేని అవకాశవాదుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలుగుతుందన్నారు. రాజకీయాల్లో పరిపాలనలో కొత్తధోరణికి నూతన సంవత్సరం శ్రీకారం చుడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించేలా ఉంటాయన్నారు.