‘తెలుగు జాతి మ‌న‌ది- నిండుగ వెలుగు జాతి మ‌న‌ది’

        ‘తెలుగు జాతి మ‌న‌ది- నిండుగ వెలుగు జాతి మ‌న‌ది’

TELUGU TALLI, TELANGANA
TELUGU TALLI, TELANGANA

తెలంగాణా నాది, రాయలసీమనాది సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. ‘ప్రాంతాలు వేరయినా, మన అంతరంగ మొకటేనన్నా, యాసలు వేరుగవ్ఞన్నా, మన బాస తెలుగు బాసన్నా, వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో, భాగవతం వెలిసిందీ ఏకశిలానగరంలో ఈ రెంటిలోన ఏదికాదన్నా ఇన్నాళ్ల సంస్కృతి నిండుసున్నా. తెలుగు జాతి మనది నిండుగ వెలుగుజాతి మనది మహానటుడు ఎన్‌.టి. రామారావ్ఞ తన సినిమా ‘తల్లా పెళ్లామా చిత్రానికి తెలుగుభాషపై ఒక గీతం రాయమని కోరగా, మహాకవి సి.నారాయణరెడ్డి రాసి యిచ్చిన గేయమే ఇది!ఎంత మధురమైనదా గీతం! ఎంత సందేశాత్మకమైనది! రెండు తెలుగు రాష్ట్రాలకు ‘ప్రాంతీయ భాషా గేయం కాదగిన అద్భుత గీతమది!

తెలంగాణ, రాయలసీమ, సర్కార్లు, నెల్లూరు- ఇవి ఆయా ‘ప్రాంతాల భౌగోళికనామాలు. ఈ ప్రాంతాల న్నింటిని కలిపేది వాటిలోని మాతృభాష! అదే తెలుగు భాష! ఆ తెలుగు భాషాసభలే ఇప్పుడు గత మూడు రోజులుగా హైదరాబాద్‌ లో జరుగుతున్నాయి. రేపటితో ముగుస్తాయి. కాగా, ప్రథమ ప్రపంచ మహాసభలను తలపెట్టిన అప్పటి (1975) అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి జలగం వెంగళరావ్ఞ, విద్యామంత్రి మండలి వెంకట కృష్ణారావ్ఞలు ప్రాతఃస్మరణీయులు. భారత స్వాతంత్య్రానంతరం దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డానికి తన ఆత్మ బలిదానం ద్వారా అవకాశం కల్పించిన అమరజీవి పొట్టిశ్రీరాములు చిరస్మరణీయుడు.

అంతేకాదు-తెలుగు వారికి ప్రత్యేకరాష్ట్రాన్ని నిర్మించాలన్న ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆంధ్రరాష్ట్ర ప్రథమ ముఖ్య మంత్రి ‘ఆంధ్రకేసరి టంగు టూరి ప్రకాశం, హైదరాబాద్‌ స్టేట్‌ నుంచి తెలంగాణాను వేరుచేసి, ఆంధ్రరాష్ట్రంతో కలిపి ‘విశాలాంధ్ర నిర్మాణానికి తన ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేసిన ఆనాటి హైదరాబాద్‌ స్టేట్‌ముఖ్యమంత్రి బూర్గులరామకృష్ణారావ్ఞ ఈ సమయంలో స్మరణీయులు. అంతే కాదు- ప్రత్యేక తెలంగాణాఏర్పడి, నిండా నాలుగేళ్లయినా కాకుం డానే, నవతెలంగాణా నిర్మాణాత్మకార్య క్రమంలో ఉండగానే అయిదవ ప్రపంచ తెలుగు మహా సభలను జరపడానికి సాహసో పేతంగా నిర్ణయించిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ను తెలుగువారంద రూ అభినందించాలి. తెలుగు భాషపట్ల కె.సి.ఆర్‌ అనురక్తి,బాల్యం లోనే తెలుగుపద్యాల ధారణాశక్తి, ఆయన అనిర్వచ నీయమైన గురు భక్తి మహాసభల మొదటిరోజునే వ్యక్తమైనాయి.

                                                                ఒక వెలితి

అయితే, ఈ మహాసభలకు తోటి పెద్ద తెలుగు రాష్ట్రం ఆంధ్రప్ర దేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించకపోవడం వెలితిగానే ఉన్నది. అయినా, ఆయన తనను ఆహ్వానించకపోయినా ఫరవాలేదని, ప్రపంచ తెలుగు మహాసభలకు తమ పార్టీ మద్దతు యిస్తున్నదని, తెలుగుభాషను ప్రతిఒక్కరూ గౌరవించాలని, తెలుగు వారందరు కలిసి కట్టుగా వ్ఞండాలన్నదే తన అభిమతమని ప్రకటించడం ఆయన హుందాతనా నికి, రాజనీతిజ్ఞతకు నిదర్శనం.

                                                             కె.టి.ఆర్‌. విజ్ఞత

కాగా, అంతే హుందాతనాన్ని తెలంగాణా భావి ముఖ్యమంత్రి కాదగిన ఐ.టిశాఖ మంత్రి తారక రామారావ్ఞ ప్రదర్శించారు. హైదరా బాద్‌లో ఎన్నోఐ.టి కంపెనీలు రావ డానికికాని,హైదరా’బాద్‌లోనే సైబ రా’బాద్‌ ఏర్పడ్డానికికాని చంద్ర బాబే కారకుడని, తాను కాదని ప్రకటించడం ఆయన నిజాయితీకి, హుం దాతనానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఇలాంటి సుహృద్భావ సామ రస్యాలు రెండు తెలుగు రాష్ట్రాలఅధినేతలు, పాలకుల మధ్య ఉండ డం తెలుగుల అభివృద్ధికి తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి అవసరం.

                                             తెలుగు తల్లి, తెలంగాణ తల్లి వేర్వేరు కాదు!

చివరగా ఒకమాట. నా వయస్సు ఇప్పుడు దాదాపు 90 సంవ త్సరాలు. నేను జర్నలిజంలోకి వచ్చి 70 సంవత్సరాలు పూర్తి అయినాయి. ఇంత సుదీర్ఘమైన అనుభవ విజ్ఞానాలతో ఒకమాట చెప్పదలచుకున్నాను. ‘తెలుగు తల్లి వేరు, ‘తెలంగాణా తల్లివేరని కొందరు భావిస్తున్నారు. తెలంగా అనే ఒక ప్రాంతం లేదా, రాష్ట్రం పేరు. ‘తెలుగు అనేది ఒక భాష పేరు. తెలుగు భాష అటు తెలం గాణాకు, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు మాతృభాష. మాతృభాషను ఇంగ్లీషు లో కూడా ‘మదర్‌టంగ్‌ అంటారు కదా! అందువల్ల ‘తెలుగుతల్లి ఉభయ తెలుగు రాష్ట్రాలకు తెలుగుతల్లే. మరి, తెలంగాణాలో ఇప్పుడు జరుగుతున్నవి ప్రపంచ ‘తెలుగు మహాసభలేకదా! అందు వల్ల తెలుగు భాషామ తల్లి తెలుగు మాట్లాడేవారందరికి తెలుగు తల్లే. కాగా, ‘తెలంగాణా అనే పేరు తెలుగు భాష నుంచి వచ్చిందే. తెలుగు మాట్లాడేవారి ప్రాంతం కాబట్టే తెలంగాణా -కాశ్మీరీ భాష మాట్లాడే ప్రాంతాన్ని కాశ్మీర్‌ అని, తమిళం మాట్లాడే ప్రాంతాన్ని తమిళనాడు అన్నట్టు! అందువల్లనే, ఈ వ్యాసం సూచికా చిత్రాలు గా అటు తెలుగు తల్లి, ప్రక్కన తెలంగాణా తల్లి చిత్రాలు ఉన్నాయి! ఒకటి దారం కాగా, మిగిలిన రెండూ పూసలు!
డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (”పద్మశ్రీ అవార్డు గ్రహీత)