తెలుగుజాతి పండుగ మహానాడు

Chandrababu in Mahaanadu , Vizag
Chandrababu in Mahaanadu , Vizag

తెలుగుజాతి పండుగ మహానాడు

విశాఖ: మహానాడు తెలుగుజాతికి పండుగ అని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెదేపా మహానాడు ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు.. దూరదృష్టితో ఆలోచించి తెలుగువారి కోసం, బడుగు, బలహీనవర్గాలవారి కోసం మన నాయకుడు ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.. అందుకే తెలుగురవారంతా కూడ మమానాడు కోసం ఆసక్తిగా చూస్తారనానరు.. ఒక సుందర నగరం విశాఖ అటువంటి నగరంలో మహానాడును పెట్టుకున్నా.. అని అన్నారు.. హుద్‌హుద్‌ తుఫాన్‌తో కళావిహీనమైన విశాఖ నగరాన్ని విశాఖ వాసులు పట్టుదలతోపెద్దపోరాటం చేసి సుందరనగరంగా మార్చారని అన్నారు.

కార్యకర్తల త్యాగాలవల్లే గుర్తింపు

తెలుగు దేశం పార్టీకి, వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు , తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావటానికి కారణం పార్టీ కార్యక్తల త్యాగాలే అన్నారు.. మహానాడులో ఆయన మాట్లాడâత, కార్యకర్తలు చూపిన అభిమానానికి , వారు చేసిన త్యాగాలకు పాదాభివందన చేస్తున్నానని అన్నారు .పార్టీ ఈస్థాయిలో ఉందంటే అందుకు కారణం కార్యకర్తలేనని అన్నారు.

అద్భుత స్పందన

మొన్న హైదరాబాద్‌లో తెలంగాణ తెలుదేశం మహానాడు నిర్వహించుకున్నామని, తాను వెళ్లానని, ఉమ్మడ డి రాష్ట్రంలో మహానాడుకు ఎంత స్పందన ఉందో అంత కంటే బ్రహ్మాండమైన స్పందన తెలంగాణ తెలుగుదేశం మహానాడుకు వచ్చిందన్నారు.. తెలంగాణ మహానాడుకు వచ్చిన స్పందనకు కారణం మనం ప్రజల కోసం పనిచేస్తుండటమే నని అన్నారు.. వారు మనకు మద్దతు ఇస్తారని అన్నారు.. వినూత్నమైన , ప్రజాహిత , ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీయే అని అన్నారు.. అంతరాలు లేని సమాజం కోసం పనిచేయటం తన విధానమని, అందుకు అందరి మద్దుతు కావాలని అన్నారు.