తెలంగాణ శ్రేయస్సుకోసమే కంకణం

CM Kcr in pleenary
CM Kcr in pleenary

తెలంగాణ శ్రేయస్సుకోసమే కంకణం

హైదరాబాద్‌: తెలంగాణలో వేసవికాలం వచ్చిందంటే మంచినీటి సమస్య చెప్పుకుంటూ పోతే రామయణం అంత, మాట్లాడుకుంటే భారతమంత అయితే ఆ పరిస్తితిని మార్చాలని కంకరణం కట్టుకున్నామని సిఎం కెసిఆర్‌ అన్నారు.. అందుకోసమే మిషన్‌ భగీరథ చేపట్టామని చెప్పారు.. ప్రభుత్వం ప్రాధాన్యతను గుర్తించి నిర్ధారించుకుని ముందుకు సాగుతున్నామన్నారు..టిఆర్‌ఎస్‌ ప్లీనరలో ఆయన మాట్లాడుతూ, దేశం మొత్తంలో పురోగతి బాటలో వెళ్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమేనని, ఫిక్కీ మాజీ అధ్యక్షుడు లేఖరాశారని సిఎం తెలిపారు.

అన్నివిధాలుగా విధ్వంసానికి గురై వచ్చిన తెలంగాణ

2014 జూన్‌ 2న తెలంగాణ వచ్చిందని ఆయన తెలిపారు.. ఆ వచ్చింది ఎలాంటి తెలంగాణ అన్ని విధాలుగా విధ్వంసానికి గురైన వచ్చిందని అన్నారు.. ప్రత్యేక తెలంగాణ వచ్చి తాను సిఎంగా ప్రమాణ సీఈ్వకరాం చేసే నాటికి తెలంగాణ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అన్నారు.. విద్యుత్‌ ఎపుడు వస్తదో ఎపుడు పోతదో తెలియదు.. సచివాలయం అంతా దళారీల గుంపులు,సిరిసిల్లలో చేనేతల ఆత్మహత్యలు, జిల్లా కలెక్టర్లు అక్కడ గోడలపై ఆత్మహత్యలు పరిష్కారంరు అని రాయించే పరిస్థితి విభజనేకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే విద్యుత్‌ ఉండదని చెప్పారు..అయితే ఇపుడు పరిస్తితి ఏంటి కరెటు కోతలు లేని తెలంగాణ , సంక్షేమ తెలంగాణ ఆసరీ పింఛన్లతో ప్రారంభమై అన్ని విధాలుగా పురోభివృద్ధి బాటలో నడుస్తున్నామని చెప్పారు.
=