తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ

RAJATH KUMAR
RAJATH KUMAR

హైదరాబాద్‌: సోమవారం తెలంగాణలో శాసనసభ ఎన్నిలకల నోటిఫికేషన్‌ జారీ అయింది. కాగా సోమవారం నుండే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, నామినేషన్లు దాఖలుచేసే అభ్యర్థుల ఖర్చు మొదలైనట్టేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. సోమవారం తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 48 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను వారంరోజుల్లోగా అందజేయాలని స్పష్టంచేశారు. లేనిపక్షంలో స్టార్ క్యాంపెయినర్ల ఎన్నికల ఖర్చులన్నీ ఆయా పార్టీలకు చెందిన స్థానిక అభ్యర్థుల ఖాతాలోకి వెళ్తాయని హెచ్చరించారు.