తెలంగాణ వ‌చ్చినా నిరుద్యోగుల బ‌ల‌న్మ‌ర‌ణాలు ఆగ‌డం లేదుః రేవంత్‌

 

Revanth reddy
Revanth reddy

హైదరాబాద్: రాష్ట్రం వచ్చినా యువత బలిదానాలు ఆగడం లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేటీఆర్ తెలంగాణలో చప్రాసీ ఉద్యోగానికి కూడా అర్హుడు కాదని వ్యాఖ్యానించారు. దళితుల రిజర్వేషన్‌ను కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తే ఎలా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ వియ్యంకుడే తప్పుడు సర్టిఫికెట్‌తో లబ్ధిపొందుతున్నారని, ఫిర్యాదు చేస్తే తొక్కిపెట్టారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకొనే దమ్ముందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇక రోజులు లెక్కబెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.