తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్‌ శాతం

voting
voting


హైదరాబాద్‌: తెలంగాణలో ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన చొరవ లోక్‌సభ ఎన్నికల్లో చూపలేదు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పోలింగ్‌ శాతం దారుణంగా పడిపోయింది. ఓటర్లలో ఇంత మార్పు రావడానికి పలు కారణాలున్నట్లు తెలుస్తుంది. ఏపిలో కూడా అదే రోజు ఎన్నికలు, తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు కావడం, వేసవి తాపం ఎక్కువగా ఉండడం వల్ల పోలింగ్‌ శాతం పడిపోయిందని వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. గురువారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ట్రోగ్రత నమోదయింది. గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు పెద్దఎత్తున కదిలారు. 73.02 శాతం పోలింగ్‌ నమోదయింది. కానీ అప్పటితో పోలిస్తే ప్రస్తుత ఎన్నికలను ఓటర్లు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/