తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్తింపు
సమైక్యాంధ్రప్రదేశ్లోని చట్ట నిబంధనలు
తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్తింపు
– ఆదేశాలు జారీ చేసిన కెసిఆర్ సర్కార్
హైదరాబాద్ : సమాఖ్యాంధ్రప్రదేశ్లో అమలైన గ్రామీణ,ఉత్పత్తుల అభివృద్ధి పన్నుల నిబంధనలను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి వీలుగా ఆ నిబంధనలను వర్తింప చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ది ఆంధ్రప్రదేశ్ రూరల్ అండ్ ఇన్ఫ్రాక్చర్ డెవలప్మెంట్ సెస్,రూల్స్-1996 నిబం ధనలను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రూపొందించిన నియమాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్తింప చేస్తామని, ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రూరల్ అండ్ ఇన్ఫ్రాక్చర్ డెవలప్మెంట్ సెస్ రూల్స్-1996 (తెలంగాణ అడప్షన్) ఆదేశాలు-2016గా వ్యవహరిస్తామని, ఈ ఆదేశాలు 2014 జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ సెస్ యాక్ట్ 1996ను కూడా వర్తింప చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేగాక ది ఆంధ్రప్రదేశ్ టాక్స్ ఆన్ ఎంట్రీ ఆఫ్ మోటర్ వెహికల్స్ ఇంటూ లోకల్ ఏరియాస్ రూల్స్,1996 నిబంధనలను కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్తింపచేస్తున్నట్లు తెలిపారు. ఈ చట్ట నిబంధనలు కూడా 2014 జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్ మిశ్రా వెల్లడించారు.