తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌‌లో జాబ్స్

INDIAPOST
INDIAPOST

పదో తరగతి అర్హతతో పోస్టల్ సర్కిల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయింది. 18ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అదనపు విద్యార్హతలకు వెయిటేజీ ఉండదు. పదో తరగతిలో వచ్చిన మార్కులను బట్టి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థులకు ఒకే మార్కులు వచ్చినట్లయితే.. పుట్టిన తేదీ, ఎస్టీ ఫిమేల్, ఎస్సీ ఫిమేల్, ఓబీసీ ఫిమేల్, అన్ రిజర్వ్‌డ్ ఫిమేల్, ఎస్టీ మేల్, ఎస్సీ మేల్, ఓబీసీ మేల్, అన్ రిజర్వ్‌డ్ మేల్.. ఆర్డర్‌లో షార్ట్‌లిస్ట్ చేస్తారు.
మొత్తం ఖాళీలు: 1058 (జనరల్‌ వర్గానికి 559, ఓబీసీలకు 247, ఎస్సీలకు 133, ఎస్టీలకు 76, దివ్యాంగులకు 43 పోస్టులను కేటాయించారు.)
డివిజన్లు: ఆదిలాబాద్‌, హన్మకొండ, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్‌, హైదరాబాద్‌ (సిటీ/ సౌత్‌ ఈస్ట్‌), మెదక్‌, సంగారెడ్డి, సికింద్రాబాద్‌.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 9
వెబ్‌సైట్‌: http://appost.in/gdsonline