తెలంగాణ పోలీస్‌ కీర్తిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన అనురాగ్‌ శర్మ

CP Mahendar reddy

తెలంగాణ పోలీస్‌ కీర్తిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్‌ శర్మదేనని కొత్త డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. ఇవాళ అనురాగ్‌ శర్మకు తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్‌ను అనురాగ్‌ శర్మ దేశంలోనే మొదటిస్థానంలో నిలిపారని, సిబ్బంది కొరత ఉన్నా సవాల్‌గా స్వీకరించి ముందుకెళ్లారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు.