తెలంగాణ నూత‌న డీజీపీగా మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కం

ts new dgp Mahender reddy
ts new dgp Mahender reddy

హైదరాబాద్: తెలంగాణ నూతన డిజిపిగా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మహేందర్ రెడ్డికి సైబరాబాద్‌, హైదరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అనే కాన్సెప్ట్‌ను తీసుకురావడం, పోలీస్ శాఖను ప్రజలకు సన్నిహితం చేయడంలో మహేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. సిటీ పోలీస్ కమిషనర్‌గా కూడా మహేందర్ రెడ్డికే అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ నగర పోలీస్ తాత్కాలిక కమిషనర్‌గా వి.వి శ్రీనివాసరావును నియమించారు.