తెలంగాణ గ్రూప్‌-1 ఫ‌లితాల వెల్ల‌డికి మార్గం సుగ‌మం!

 high court
high court

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్ష ఫలితాల వెల్లడికి అడ్డుతొల‌గింది. ఈ పరీక్ష రాసిన తర్వాత తనను
అనర్హుడిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ గతంలో శ్రీకాంత్‌రెడ్డి అనే అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై
విచారించిన ఉన్నత న్యాయస్థానం ఒక్క పోస్టును పక్కనపెట్టి నియామక ప్రక్రియ చేపట్ట వచ్చని గతంలో మధ్యంతర
ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఏ పోస్టును ఏ విధంగా పక్కన పెట్టాలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఇంటర్వ్యూలు
పూర్తయినప్పటికీ టీఎస్‌పీఎస్సీ ఫలితాలను వెల్లడించకుండా నిలిపివేసింది. గురువారం హైకోర్టు ఈ పిటిషన్‌ను
కొట్టివేయడంతో ఫలితాల వెల్లడికి మార్గం సుగ‌మ‌మైంది. దీంతో క‌మిష‌న్ అధికారులు న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించి
ఫ‌లితాల వెల్ల‌డికి మార్గల‌ను అన్వేషిస్తున్నారు.