తెలంగాణ ఏజీగా శివానంద‌ప్ర‌సాద్‌

BREAKING NEWS
BREAKING NEWS

హైదరాబాద్: తెలంగాణ అడ్వకేట్ జనరల్‌గా బండ శివానందప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వకేట్ నియామక ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ప్రస్తుతం శివానంద హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. శివానందప్రసాద్ స్వస్థలం జనగామ. తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ జయసాయి ప్రకాశ్‌‌రెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితం. నాలుగు నెలల క్రితం ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌‌కుమార్‌ అనర్హత కేసు విషయంలో సరిగా వాదించలేదని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేశారు.