తెలంగాణ, ఎపి టాక్స్‌లక్ష్యం రూ.60,485 కోట్లు

INCOME TAX  copy
INCOME TAX copy

తెలంగాణ, ఎపి టాక్స్‌లక్ష్యం రూ.60,485 కోట్లు

హైదరాబాద్‌: 2017-18 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాదు రీజి యన్‌ ఆదాయపు పన్ను శాఖ వసూళ్లలో 22శాతం వృద్ధి సాధించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60,485కోట్ల రూపాయలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎస్‌.పి.చౌదరి సోమవారం తెలి పారు. 158వ ఆదాయపు పన్ను సెలబ్రేషన్లను పురస్తరించుకొని సోమవారం ఏర్పాటు చేసిన మాగియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..2018-19కి గాను మొత్తం వసూళ్లు 10,13,000కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

దేశంలో అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న సంస్థగా ఎన్‌ఎండిసి రికార్డు సృష్టించిందని అన్నారు. గత ఏడాడిలో ఆసంస్థ 2259 కోట్లను పన్ను రూపంలో చెల్లించిందని తెలిపారు.475 కోట్లతో ఆంధ్రాబ్యాంకు రెండవ స్థానంలో 237 కోట్లతో తిరుపతికి చెందిన అమర్‌రాజా బ్యాటరీ మూడ వ స్థానంలో ఉందని తెలిపారు. రెండు తెలుగు రాZషాలలో కలిపి 17 రీజియన్లు ఉన్నాయని అన్నింటిలో పన్ను వసూళ్లు తృప్తికరంగానే ఉన్నట్లు తెలిపారు. రెండు రాZషాలలో కలిపి కోటి మందికి పైగా పాన్‌ కార్డుహోల్డర్లు ఉండగా అందులో 36లక్షల మంది ఆదాయపు పన్ను రిటర్నును దాఖలు చేసారని తెలిపారు .