తెలంగాణ ఉద్య‌మాన్ని స్పూర్తిగా తీసుకోండిః త‌ల‌సాని

talasani
talasani

హైద‌రాబాద్ః ఆంధ్రప్రదేశ్ నాయకులకు పోరాట స్ఫూర్తి లేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏపీ ఎంపీలు రాజీనామా చేస్తే దేశం దృష్టిని ఆకర్షిస్తారని తలసాని అన్నారు. అలాగే దేశంలో ఎక్కడ సమస్యలు ఉన్నా కేసీఆర్‌ నాయకత్వం వహిస్తారని, ఏపీ ప్రజలు కూడా కోరుకుంటే నాయకత్వానికి కేసీఆర్‌ సిద్ధమేనని మంత్రి పేర్కొన్నారు