తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంది

KCR
TS CM KCR

 

తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంది

2024 నాటికి 5లక్షల కోట్లకు బడ్జెట్‌

హైదరాబాద్‌: 2024 నాటికి తెలంగాణ బడ్జెట్‌ 5 లక్షల కోట్లకు చేరుతుందని సిఎం కెసిఆర్‌ తెలిపారు.సోమవారం రాత్రి కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు.. బడ్జెట్‌ పెరుగుతున్న కొద్దీ వ్యవసాయ రంగానికి ఎక్కువ పెట్బుడులు లిస్తామని చెప్పారు.. సాగునీటి రంగానికి ఏడేల్ల వరకు కార్యాచరణ , విజన్‌ రూపొందించాలని అన్నారు.. సాగునీటి కోసం రూ.15 వేల కోట్ల విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.. గుండమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్ల కంటే ముందే కాల్వల నిర్మాణం చేయాలని ఆయన సూచించారు.. సింగూరుకు లిఫ్ట్‌లు పెట్టి నారయణఖేడ్‌, జహీరాబాద్‌కు నీళ్ల్లివ్వాలని చెప్పారు.