తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజ

Challa Laxma reddy
Challa Laxma reddy

హైద‌రాబాద్ః తెలంగాణ ఏర్పడి మూడున్నరేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని, సంక్షేమ పథకాల అమలు, ప్రగతిలో దేశంలోనే అగ్రశ్రేణిలో కొనసాగుతోందని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు జరుతున్న అభివృద్ధి, పేదల ఉద్దరణ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నారు. పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం లో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర డైరీని ఆయన ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు.
అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలందుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, త్వరలో ఆయా సమస్యలను సీఎం దృష్టికి తీసుకొస్తానని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన పోరాటాల్లో ఉద్యోగులు మహత్తర పాత్ర పోషించారని కొనియాడారు.