తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్‌ 1..అయినప్పటికి మరింత ముందుకు

HARISH RAO

దేశంలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా ఉందని, అయినప్పటికి మరింత ముందుకు వెళ్లాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇవాళ జలసౌధలో నిర్వహించిన తెలంగాణ గిడ్డంగుల సంస్థ సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, గోడౌన్లను వినియోగించుకోవడంలో దేశంలోనే ముందుందని పేర్కొన్నారు. ఇప్పటికే మార్కెటింగ్‌లో నిజామాబాద్‌ ఈనామ్‌లో నెం.1గా నిలిచిందని, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలోనూ మనమే ముందున్నామన్నారు. అయినప్పటికీ మరింత ముందుకు వెళ్లాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశానికి గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామెల్‌ హాజరయ్యారు