తెలంగాణ భవన్‌కు బాంబు ఫోన్ కాల్

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ భవన్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హుటాముటిన తనిఖీలు చేపట్టి బెదిరింపు కాల్‌గా నిర్ధారించారు. ఈ కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఆదిలాబాద్ వాసిగా గుర్తించారు.