తెలంగాణ‌లో ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ ఏర్పాటు

Telangana
Telangana

తెలంగాణలో రూ.2,500 కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి ఎంవోయూ కూడా కుదిరింది. కాగా, తెలంగాణ ప్రభుత్వంతో అబుదాబికి చెందిన లాలూ సంస్థ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. కాగా, మంత్రి కేటీ ఆర్‌ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అబుదాబి సంస్థ ప్రతినిధులు వె ల్లడించారు.