తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరుగుతుంది

etela rajender
etela rajender

హైదరాబాద్‌: తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ఆయకట్టుతో పాటు…ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి, నీటి సామర్ధ్యం పెంచి సాగు విస్తీర్ణం పెంచుతున్నామని టిఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎస్సారెస్పీ కాలువ సామర్థ్యాన్ని 3 వేల నుంఇచ 6 వేల క్యూసెక్కులకు పెంచామన్నారు. ఎస్సారెస్పీ పనుల్ని జూన్‌ 30లోగా పూర్తి చేయాలని సియం కేసిఆర్‌ అధికారులను ఆదేశించారని ఈటల చెప్పారు. భూసేకరణతో పాటు ఉన్న సమస్యలన్నింటిని పరిష్కరించి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.