తెలంగాణలో వర్షం

RAIN--
RAIN–

తెలంగాణలో వర్షం

హైదరాబాద్‌: హిందూ మహాసముద్రం- దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనా నికితోడు 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ ఉప రితల ఆవర్తనం కొన సాగుతోంది. ఉపరితల ఆవర్తనం నుండి తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో శనివారం హైదరాబాద్‌ నగరంతో పాటు, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇన్నాళ్లూ చలి పంజాతో వణికిని జనం ఇప్పుడు వర్షంతో పులకిస్తున్నారు. హైదరాబా ద్‌లో కురిసిన వర్షంతో వాతావరణం చల్లగా మారింది. హైదరాబాద్‌ సిటీ మొత్తం ఆకాశం మేఘావృతమై, చెదురుమదురు వర్షాలు పడ్డాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైర తాబాద్‌, సికింద్రాబాద్‌, కాప్రా, మౌలాలి, కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ ప్రాం తాల్లోవర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులతో వాతావరణం అహ్లాదకరంగా మారింది. రిపబ్లిక్‌ డే కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే హైదరా బాద్‌ సిటీలో కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతు న్నాయి. 14-15 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి.