తెలంగాణలో రైతులు సేద్య‌న్ని నమ్ముకునే స్థితి లేదు

Kodandra ram 1213
Kodandra ram

సేద్యాన్ని నమ్ముకుని రైతులు బతికే పరిస్థితి లేదని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. సరూర్ నగర్ లోని మైదానంలో నిర్వహించిన ఆవిర్భావ సభలో కోదండరామ్ మాట్లాడుతూ… రాష్ట్ర సంపదలో రైతులకు దక్కుతున్నది నూటికి రూ.7లు మాత్రమేనన్నారు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని ఆశించామని, అయితే సమైక్య పాలనలో ఏం జరిగిందో… ప్రత్యేక రాష్ట్రంలోనూ అదే జరుగుతోందన్నారు.