తెలంగాణలో రేపు అక్కడక్కడ వర్షాలు

RAIN FALL
RAIN FALL

హైదరాబాద్‌: తెలంగాణలో రేపు  అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు  పొడి వాతావరణమే ఉంటుందని, ఉదయం, రాత్రి వేళల్లో కొన్ని చోట్ల పొగమంచు ఉంటుందని చెప్పారు. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.