తెలంగాణలో మద్యం విధానంపై నేడు నిర్ణయం

పలువురు మంత్రులకు సిఎం కెసిఆర్‌ ఫోన్‌

kcr

హైదరాబాద్‌: దేశంలో విధించిన రెండోదశ లాక్‌డౌన్‌ నేటితో ముగియనుంది. ఇప్పటికే కేంద్రం మరోసారి దేశంలో లాక్‌డౌన్‌ ను మరో రెండు వారాల పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికి దేశంలో వైన్‌ షాపులను తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా మద్యం దుకాణాలు తెరచుకుంటాయా లేదా అనే సందిగ్దం నెలకొంది. తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్‌ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు అనుమతించాలా వద్దా అనేది నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశంపై పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులకు, సిఎం కెసిఆర్‌ ఫోన్‌ చేసి లాక్‌డౌన్‌ సడలింపులపై చర్చించారు. నిఘా వర్గాల నుంచి కూడా అభిప్రాయలను సేకరించి మద్యం షాపులపై ప్రభుతం నిర్ణయాన్ని వెలువరిస్తుందని తెలుస్తుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/