తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు టీఎస్‌ ఎంసెట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్‌ 20న పీజీఈసెట్‌, జూలై 1న ఈసెట్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు టీఎస్‌ ఎడ్‌సెట్‌, ఐసెట్‌, లాసెట్‌, పీజీలాసెట్‌, టీఎస్‌పీఈసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ నిర్ణయించాల్సి ఉంది. ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం మూడు ఎంట్రెన్స్‌లకు మాత్రమే తేదీలు ప్రకటించింది. మిగతావి డిగ్రీ పరీక్షలతో ముడిపడి ఉండటంతో పెండింగ్‌లో ఉంచింది.

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల