తెలంగాణలో పాగాకు కాంగ్రెస్‌ యత్నాలు

RAHUL GANDHI
RAHUL GANDHI

తెలంగాణలో పాగాకు కాంగ్రెస్‌ యత్నాలు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై అధిక దృష్టి సారించింది.తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కసరత్తు జరుగుతున్నట్లుగా ప్రచారం పెరగ డంతో కాంగ్రెస్‌ కూడా ఈ మేరకు తన కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నది. పార్టీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్‌కు తెలంగాణలోనూ ఫలితం దక్కకపోవడంతో ఏర్పడిన దుస్థితి నుంచి గట్టెక్కేందుకు 2019లో వచ్చే సాధారణ ఎన్నికలను సవాల్‌గా తీసు కుంటున్నది. అందుకే ఈ నెల 13, 14 తేదీల్లో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటనకు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు.

గత ఎన్ని కల్లో పార్టీకి జరిగిన లోటుపాట్ల వివరాలను క్రోఢీకరించుకొని, వాటిని సరిదిద్ధడానికి అన్నట్లుగా తాజాగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితిని సమర్థవంతంగా ఎదుర్కునేలా కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కూడా హస్తిన నేతలు చర్యలు తీసుకుంటున్నారు.అయితే ప్రదేశ్‌ కాంగ్రెస్‌లో సమన్వ యలోపం, వర్గపోరు, ముఖ్యమంత్రిత్వం కోసం జరుగుతున్న అం తర్గత కుమ్ములాటల వంటి అంశాలపై కూడా రాహుల్‌ గాంధీ దృష్టి పెడతారని, దీంతో వచ్చే ఎన్నికలకు అందరూ కలిసికట్టుగా కదలడానికి వీలు కలిగేలా పార్టీ పరంగా దశ, దిశను నిర్ధేశించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పరంగా ఇంకా పూర్తి స్థాయి కార్యవర్గం ఏర్పాటు కాని పరిస్థితిలో అన్ని వర్టాలకు