తెలంగాణలో డిసిబి బ్యాంకు ఐరిస్‌ ఎటిఎం

DCB-1
DCB-1

తెలంగాణలో డిసిబి బ్యాంకు ఐరిస్‌ ఎటిఎం

హైదరాబాద్‌,జూన్‌ 16: డిసిబి బ్యాంకు మొట్టమొదటిసారిగా తెలంగాణలోని మూడు శాఖల్లో ఆధార్‌ ఐరిస్‌ఐస్కాన్‌, వేలిముద్రలసాయంతో పనిచేసే ఎటిఎంలను ప్రారంభించింది. మంచిర్యాల, మోతే, నర్సాపూర్‌ గ్రామాల్లోని రైతులకు బ్యాంకింగ్‌ సేవలు మరింత చేరువచేసేందుకువీలుగా ఈ చర్యలు చేపట్టింది. అంతేకాకుండా రైతులతోపాటు వ్యక్తిగతరుణాలు, వ్యవసాయం, వ్యాపారం, స్వయం సహా యక బృందాల వ్యాపారం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణపరపతిని అందించేందుకబ్యాంకు విశే షంగా కృషిచేస్తున్నట్లు ప్రకటించింది. ఆధార్‌సాయం తో ఐరిస్‌స్కాన్‌, చేతివేలిముద్రలసాయంతో నడిచే ఎంటిఎంలను ప్రారంభించింది.

బ్యాంకు ఇప్పటికే ట్రాక్టర్లు, డైయిరీ, పంటరుణాలు, భూమి అభివృద్ధి, వ్యవసాయ శుద్ధి కార్యకలాపాలకు రుణపరపతిని అందిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే గోదాము రసీ దుల సెక్యూరిటీతోరతులకు రుణాలిస్తుందని, పసిడి రుణాలు, ఎంఎస్‌ఎంఇలకు రుణాలు, విదేశీ కరెన్సీ సేవలు వంటి వాటిని కూడా ఇతోధికంగా డిసిబి బ్యాంకు అందిస్తుందని బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు ముఖ్య ఆర్థిక అధికారి భరత్‌ సంపత్‌ మాట్లా డుతూ తెలంగాణలో మొట్టమొదటి ఆధార్‌ ఆధారిత ఎటిఎంను ప్రారంభించామని ఇదొక చక్కని అవకాశం అన్నారు. డిసిబి బ్యాంకుకు తెలంగాణ ఎంతో కీలకమార్కెట్‌ అన్నారు. కొత్త ఎటిఎంలు, శాఖల్లో కూడా ఖాతాదారులకు విస్తృత సేవలందుతాయన్నారు.

వ్యవసాయం, ఆర్ధికచేకూర్పు విబాగం హెడ్‌ నరేంద్రనాధ్‌ మిశ్రా మాట్లాడుతూ తెలంగాణలోని డిసిబి బ్యాంకుశాఖలు స్నేహపూర్వక సేవలు అందిస్తాయన్నారు. ప్రైవేటురంగంలోని కొత్తతరం బ్యాంకింగ్‌ సేవలకు శ్రీకారం చుట్టిన డిసిబిబ్యాంకుకు మొత్తం 18 రాష్ట్రాల్లోను, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోను 262 శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీ, మౌలికవనరులను పెంచుకోవడం ద్వారా ఇంటర్నెట్‌ సేవల్లో బ్యాంకు అగ్రగామిగా ఉందని, ఇటీవలే బ్యాంకు ఆధార్‌ ఆధారిత ఎటిఎం సేవలు కూడా ప్రారంభించినట్లు వివరించారు.

====