తెలంగాణలో కొత్తగా 101 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,682..మొత్తం మృతుల సంఖ్య 1,611

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 18,252 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 101 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 197 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,682 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,92,229 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,611కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 1,842 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 751 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి.