తెలంగాణలో కేసిఆర్‌ కుటంబమే బాగుపడింది..

rahul
rahul

గద్వాల: టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. గద్వాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరైన రాహుల్‌ మాట్లాడుతూ..కేసిఆర్‌ అంటే ఖావో కమీషన్‌ రావు అంటూ చమత్కరించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగాలు లేవని, తెలంగాణలో ఒక కుటుంబం మాత్రమే బంగారు కుటుంబమైందని రాహుల్‌ అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్యహత్యలు పెరుగుతున్నాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతుల అప్పులు మాఫీ చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు.