తెలంగాణలో కట్టుదిట్టమైన భారీ భద్రత

telangana assembly elections
telangana assembly elections

హైదరాబాద్‌: పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ఎన్నికల కమీషన్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బంది బందోబస్తులో నిమగ్నమయ్యారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 90 వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలీసు శాఖలో హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు సుమారు 50 వేల మంది బందోబస్తులో పాల్గొంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి 20 వేల మంది, కేంద్ర బలగాల నుంచి 20 వేల మంది తెలంగాణ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. ఈవిఎంలను పోలింగ్‌ కేంద్రాలకు తరలించడం నుంచి తిరిగి స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించేవరకు 90 వే మంది పోలీసులు డ్యూటీలో ఉంటారు. ఎన్నికల సిబ్బందికి రక్షణగా ఉంటారు. ఓటర్లు స్వేఛ్చగా ఓటు వేసుకోవచ్చు.