తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ

ips

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా బదిలీ అయిన ఐపీఎస్‌ల వివరాలిలా ఉన్నాయి.. రాచకొండ డీసీపీగా ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి, సీఐడీ ఎస్పీగా పరిమళ, సూర్యాపేట ఎస్పీగా ప్రకాశ్‌జాదవ్‌, నల్గొండ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావును నియమించగా కాగా మహబూబ్‌నగర్‌ ఎస్పీగా కల్మేశ్వర్‌ నియమితులయ్యారు. కాగా కల్మేశ్వర్‌ నాగర్‌కర్నూల్‌ ఎస్పీగానూ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.