తెలంగాణలోకి మావోలు చొరబడే అవకాశం లేదు: డీజీపీ

DGP mahender reddy
DGP mahender reddy

గోదావరిఖని: తెలంగాణలోకి మావోయిస్టులు చొరబడే అవకాశమే లేదని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఒకవేళ మావోలు చొరబడేందుకు ప్రయత్నిస్తే తిప్పికొడతామని ఆయన తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. శాఖల సమన్వయంతో ఎన్నికలో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్లలో పోలీసులు ఉంటారని ఆయన వెల్లడించారు.