తెలంగాణను దోచుకునేందుకే టిడిపి,కాంగ్రెస్‌ ఒక్కటయ్యారు

Allola Indrakan reddy
Allola Indrakan reddy

నిర్మల్‌: తెలంగాణను ఆంధ్ర బాబు చంద్రబాబు తాకట్టుపెట్టడానికి కాంగ్రెస్‌ పార్టీ టిడిపితో కుమ్మక్కైందని నిర్మల్‌ నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. తెలంగాణను దోచుకోవాలనే టిడిపి, కాంగ్రెస్‌ మహాకూటమి పేరుతో ఒక్కటయ్యాయని ఆయన చెప్పారు. వీరి కుట్రల వల్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. నిర్మల్‌ నియోజకవర్గం మామడ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.