తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదుః కేటిఆర్‌

TS MINISTER KTR
TS MINISTER KTR
మ‌ణుగూరుః కాంగ్రెస్‌ది మోసాల చరిత్ర, ద్రోహుల చరిత్ర, దగా చరిత్ర అని మంత్రి కేటీఆర్ అన్నారు. మణుగూరు ప్రగతి సభలో ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని చెప్పారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేయని పనిని టీఆర్ఎస్ చేసి చూపించిందన్నారు. ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని వ్యాఖ్యానించారు.
తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్ నేతలు గురువింద గింజల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి వారి చేసిన ద్రోహానికి జవాబు చెప్పాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌ను రద్దు చేయమని ఆనాడే గాంధీజీ చెప్పారని గుర్తు చేశారు. అధికారం, పదవులు కోసం దేశాన్ని కాంగ్రెస్ విభజించిందని మంత్రి వ్యాఖ్యానించారు.