తెలంగాణకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చాను

Chandrababu
Chandrababu

హైదరాబాద్‌: కెసిఆర్‌ విమర్శలకు చంద్రబాబు కౌంటరిచ్చాడు. నీళ్లు, పరిశ్రమలు ఏపికి తీసుకుపోతానని తనపై కెసిఆర్‌ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన ఊరికి తీసుకుపోవాలనుకుంటే ఐటీని తిరుపతికి తీసుకుపోయేవాడిన హైదరాబాద్‌లో ఎందుకు పెడతానని చంద్రబాబు ప్రశ్నించారు. ఐదేళ్లలో కనీసం లక్ష ఇళ్లు కట్టలేనివారు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళులఎలా నిర్మించగలరని నిలదీశారు. పనిచేయడం చేతకాదు కానీ, తనపై ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. తకు స్వార్థంలేదని, రాజకీయ అవసరాలు లేవని స్పష్టం చేశారు. 13 సీట్లతో తాను సీఎం ఎలా అవుతానని, ఏపీలో చేయాల్సిన పనులు, లక్ష్యాలు తనకున్నాయన్నారు. కేవలం తెలంగాణకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చానని ఆయన చెప్పారు.