‘తెరవెనుక దాసరి’ ఆవిష్కరణ

TERA VENUKA DASARI BOOK LAUNCHING
TERA VENUKA DASARI BOOK LAUNCHING

‘తెరవెనుక దాసరి’ ఆవిష్కరణ

151 చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు డాక్టర్‌ దాసరి నారాయణరావు జీవిత చిత్రను తెర వెనుక దాసరి అనే పుస్తకరూపంలో తీసుకొచ్చారు సీనియర్‌ జర్నలిస్టు పసుపులేటి రామారావు.. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. టి. సుబ్బరామిరెడ్డి, మెగాస్టార్‌చిరంజీవి, అల్లు అరవింద్‌, కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, శ్రీకాంత్‌, ఆర్‌.నారాయణమూర్తి, ధవళ సత్యం, బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌, తమ్మారెడ్డి భరద్వాజ, తారక ప్రభు, దాసరి అరుణ్‌కుమార్‌, ఆలమ్మ, హేమాకుమారి, పద్మ, ప్రతాని రామకృష్ణగౌడ్‌, శివాజీరాజా, సి.కల్యాణ్‌ , ఎస్వీ కృష్ణారెడ్డి, ముత్యాలసుబ్బయ్య, కోడి రామకృష్ణ , రోజారమణి తదితరులు ఆపల్గొన్నారు.. తొలిపుస్తకాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ఆవిష్కరించారు. తొలిప్రతినిది టి.సుబ్బరామిరెడ్డి , ద్వితీయ ప్రతిని కె.రాఘవేంద్రరావు అందుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ, మనిషిలో మాణిక్యం అన్నా,సినిమా పరిశ్రమలో తలమానికం అన్నా , కార్మికులకు ఇచ్చే ధైర్యం అన్నా ఎవరో కాదు స్వర్గీయ దాసరి నారాయణరావేనని అన్నారు. అలాంటి వ్యక్తి ఏ విజయం సాధించినా చరిత్రే అవుతుందన్నారు..