తెరపై కర్ణాటక రెండో రాజధాని?

KUMARA SWAMY
KUMARA SWAMY

బెంగుళూరు: కన్నడనాటలో ఇప్పుడు ఉత్తర, దక్షిణ కర్ణాటక అంటూ చర్చ జరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రానికి రెండో రాజధాని డిమాండ్‌ మరోమారు తెరపైకి వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన మనోగతాన్ని బయటపెట్టారు. ఆ విషయం తమ దృష్టిలో ఉందని, బెలగవి సిటికి సువర్ణ విధాన సౌధకు చెందిన కొన్ని ప్రభుత్వ కార్యాలయానికి తరలించే ఆలోచన తమ ప్రభుత్వం పరిశీలనలో ఉందని చెప్పారు. నేను 12ఏళ్ల క్రితం దీనిపై సలాహా ఇచ్చాను. కాగా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. బిజెపి ఇప్పుడు ఆ విషయం మాట్లాడుతోంది. 15-20 రోజుల్లో దీనిపై నేను ఓ ప్రకటన చేయబోతున్నాను. మంగళూరును ఆర్థిక రాజధానిగా మార్చాలన్నదే నా ఆలోచన అని కుమారస్వామి తెలిపారు. కుమారస్వామి జనతాదళ్‌(యునైటెడ్‌) 2006లో బిజెపితో కలిసి అధికారంలో ఉంది. కర్ణాటక రెండో రాజధానిగా బెలగవిని సూచిస్తూ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో నాడు ఆమోదించింది. కుమారస్వామి కాంగ్రెస్‌ మద్ధతుతో ఇటీవల అధికారంలో వచ్చిన విషయం విదితం. అధికారంలో వచ్చిన అనంతరం జులైలో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే,జెడియు మద్ధతుదారులు ఎక్కువగా ఉన్న దక్షిణ కర్ణాటకకు ఆయన బడ్జెట్‌ కేటాయించారంటూ ఆయన విమర్శకుల ఆస్త్రాలు ఎకుకపెట్టారు. జెడియు గెలుచుకున్న 38సీట్లలో ఎక్కువ సీట్లు ఈ ప్రాంతం నుంచి రాబట్టుకున్నవే. విపక్ష బిజెపి ఈ అంశాన్ని అందిపుచ్చుకుంది. రెడ్డిసోదరులకు సన్నిహితుడైన బిజెపి ఎమ్మెలేయ శ్రీరాములు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని లెవనెత్తగా ఉత్తర కర్ణాటకను నిర్లక్ష్యం చేస్తున్నారని తప్పుపట్టారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఐతే ఆ తర్వాత ఆయన మీడియాకు వివరణ ఇస్తూ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమనే విధంగా తన మాటలను అన్వయించుకోరాదని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండో రాజధాని అంశం తెరపైకి రావడంతో కుమారస్వామి రెండో రాజధాని విషయంలో వేగంగా పావులు కదుపుతున్నారు.