తెగ బాధపడిపోతోంది!

Rashi kanna
Rashi kanna

రాశి తెగ బాధపడి పోతోంది!

ఊహలు గుసగుసలాడే చిత్రంతో పరిచయమయిన రాశిఖన్నా మొదటి సినిమాతో హిట్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నప్పటికీ.. తన తోటి హీరోయిన్స్‌ తో పోలిస్తే మాత్రం స్టార్‌ హీరోయిన్‌ అనే క్రేజ్‌ మాత్రం ఈ అమ్మడుకి రాలేదు. రాశి ఎంత అందంగా ఉన్నా.. కాస్త బొద్దుగా ఉంటుంది. అందుకే తనకు సరైన అవకాశాలు రావడం లేదు. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం లేదు.. స్వయంగా రాశినే చెబుతోంది. నా కెరీర్‌ లో సక్సెస్‌ లు ఉన్నప్పటికీ కొన్ని ఛాన్స్‌ లు రాకపోవడానికి కారణం నా శరీరాకతే.. మిగిలిన వారితో పోల్చి చూస్తే నేను బొద్దుగా ఉంటాను. బరువు తగ్గాలనుకుంటున్నా అది మాత్రం సాధ్యం కావట్లేదు. ఒకవేళ కష్టపడి బరువు తగ్గితే దానికి రెట్టింపు బరువు పెరిగిపోతూ ఉంటాను. అందరూ వ్యాయామం రెండు గంటలు చేస్తే నేను నాలుగు గంటలు చేస్తాను. ఫుడ్‌ కూడా ఎక్కువగా తీసుకోను. బహుశా నా శరీరతత్వం అంతే అనుకుంటా.. ఒక్కోసారి నేను సినిమాలకు సరిపోనేమో అనిపిస్తుంది అంటూ తెగ బాధ పడిపోతుందీ భామ.