తెగిపోయిన బంధాన్ని ముడివేయలేం

tej pratap yadav
tej pratap yadav

న్యూఢిల్లీ: లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు, బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌.. తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తేజ్‌ ప్రతాప్‌ నిర్ణయం కుటుంబానికి నచ్చకపోవడంతో ఈ విషయంలో ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని ఉద్దేశిస్తూ తేజ్‌ప్రతాప్‌ ట్విటర్‌లో ఓ పోస్టు చేశారు. తన భార్య ఐశ్వర్య రాయ్‌తో సంబంధాలు మెరుగుపర్చుకోదల్చుకోలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు ఇరువురి మధ్య బంధం తెగిపోయినప్పుడు.. దాన్ని తిరిగి బాగుచేయలేం  అని పేర్కొన్నారు.