తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Narreddy Tulasi Reddy
Narreddy Tulasi Reddy

హైదరాబాద్ : ఏబీఎన్‌ డిబేట్‌లో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పై కక్ష వైసీపీతో పొత్తుపెట్టుకుని టీఆర్ఎస్ తీర్చుకుంటుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అప్పట్లో వైఎస్‌ టీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టాలనుకున్నారని ఆయన చెప్పారు. వైఎస్‌ బతికి ఉండిఉంటే టీఆర్‌ఎస్‌ ఉండేదే కాదన్నారు. అందుకు ప్రతీకారంగా ఇప్పుడు టీఆర్ఎస్ వైసీపీతో పొత్తుపెట్టుకుని జగన్‌ పార్టీని ఏపీలో ఫినిష్‌ చేస్తున్నారేమో? నని  తనకు అనుమానంగా ఉందన్నారు