తుఫాను మృతులకు తలా రూ 5 లక్షలు

AP CM BABU1
AP CM BABU

తుఫాను మృతులకు తలా రూ 5 లక్షలు

నూతన గృహనిర్మాణం కోసం రూ.1.50 లక్షలు

 పంట నష్టపరిహారం ప్రకటించిన ఏపీ సీఎం

బాధితులు ధైర్యంగా ఉండాలన్న ముఖ్యమంత్రి

అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు భరోసా

అమరావతి, అక్టోబర్ 14:  తుఫాను బాధితులకు తాము అండగా ఉన్నామని, బాధితులు ధైర్యంగా ఉండాలని తమ ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టెట్లీ తుఫాను దెబ్బతిన్న ప్రాంతాలలో మృతి చెందిన వారికి రూ.5 లక్షల వంతున నష్టపరిహారాన్ని వారి కుటుంబాలకు చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. తుఫాను తాకిడికి ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తగా గృహాలు నిర్మించుకోవటానికి 1.50 లక్షల పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇల్లు దెబ్బతింటే రూ.10 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.   తాను రెండు రోజుల పాటు స్వయంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పర్యటించానని, వారి కడగండ్లను చూశానని, బాధితులను కలసి కష్ట,నష్టాలు తెలుసుకున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. పలాసలో శనివారం ఉన్నతాధికారులతో టిట్లీ తుఫాను అనంతర పరిస్థితి, సహాయ పునరావాసం పై చర్చించి  నష్టపరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
 పాతిక కిలోల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు, మత్స్యకారులకు 50 కిలోల బియ్యం
 తుఫాను ప్రాంతాలలో ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని,   25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో ఆలుగడ్డలు, కిలో ఉల్లిపాయలు, అరకిలో పంచదార ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మత్స్యకార కుటుంబాలకు ఇదే సహాయంతో పాటు 25 కిలోల బియ్యం అదనంగా అంటే 50 కిలోల బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
AP CM BABU13
AP CM BABU
వరి పంట నష్టపోతే ఎకరాకు రూ. 20 వేలు
వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారు ఒక్కింటికి రూ.20 వేల పరిహారం చెల్లిస్తారు. ఇతర పంటలకు నిబంధనలను అనుసరించి నష్టపరిహారం చెల్లిస్తారు.
అరటి రైతులకు  ఎకరా ఒక్కింటికి రూ.30 వేలు, తిరిగి తోటల అభివృద్ధికి నరేగా కింద రూ.40 వేలు
అరటి తోటలు నష్టపోయిన రైతులకు ఎకరా ఒక్కింటికి రూ.30 వేల వంతున నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిపథకం (నరేగా) కింద కొబ్బరి మొక్కలు నాటి మూడేళ్ల వరకు సంరక్షణకు గాను ఎకరా ఒక్కింటికి రూ.40 వేలు చెల్లిస్తారు. కొబ్బరి చెట్లు నష్టపోయిన రైతులకు చెట్టుకు రూ.1200 వంతున చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
జీడిమామిడి రైతులకు ఎకరాకు రూ.25 వేలు,  తోటల అభివృద్ధికి నరేగా కింద రూ.40 వేలు
నష్టపోయిన  జీడిమామిడి (జీడిపప్పు) తోటల రైతులకు ఎకరా ఒక్కింటికి రూ.25,000 నష్టపరిహారం ప్రకటించారు. ఎకరా ఒక్కింటికి రూ.40,000 వంతున నరేగా నిధులతో మూడేళ్లలో తిరిగి తోటల అభివృద్ధికి (రీ ప్లాంటేషన్‌) ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పడిపోయిన చెట్లు, శకలాల  తొలగింపులో ఉద్యాన శాఖ సహాయ సహకారాలు అందిస్తుంది. ఇందుకోసం ఉద్యాన శాఖ    అగ్నిమాపక దళం, ఎస్.డి.ఆర్.ఎఫ్, డ్వామాలతో సమన్వయం చేసుకుని   పనిచేస్తుంది.
రాయితీలో రాష్ట్రం, కేంద్రం చెరిసగం
 కొబ్బరి, జీడిమామిడి రెండు పంటలు నష్టపోయిన పెద్ద  రైతులకయితే 50% కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మిగిలిన 50% రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
మెకనైజ్డ్ బోట్‌కు రూ.6 లక్షల పరిహారం, పడవ కొనుగోలుకు రూ.లక్ష
టిట్లీ తుఫానుకు పడవలు పూర్తిగా ధ్వంసమై నష్టపోయిన మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించింది. మెకనైజ్డ్ బోట్ ధ్వంసమైతే  రూ 6 లక్షలు నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పడవలు దెబ్బతిన్న మత్స్యకారులకు ఒక్కొ పడవకు రూ. లక్ష పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
AP CM BABU12
AP CM BABU
 పడవలు, వలలు కొనుగోలు చేయడానికి అయ్యే వ్యయంలో 50% రాష్ట్రప్రభుత్వం రాయితీగా అందిస్తుంది.  వలను నష్టపోయిన మత్స్యకారులకు వల ఒక్కింటికి రూ.10 వేలు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది.
 ఆక్వా రైతులకు ఎకరాకు రూ.30,000
దెబ్బతిన్న ఆక్వా రైతులకు ఎకరా ఒక్కింటికి రూ.30 వేలను చెల్లిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
పశువుల యజమానులకు రూ.30 వేలు,  పశువుల కొట్టాల నిర్మాణానికి రూ.లక్ష