తుఫాను బాధితులకు ప్రభుత్వం అండ

AP CM BABU
AP CM BABU

శ్రీకాకుళం: తిత్లీ తుఫానుతో శ్రీకాకుళం జిల్లాలో నష్టపోయిన ప్రాంతాల్లో సియం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ రోజు వజ్రపు కొత్తూరు మండలంలోని గరుడభద్రలో పర్యటించారు. తిత్లీ తుఫానుతో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయని , బాధితులకు ఎలాంటి అవసరవం వచ్చినా అండగా ఉంటామని సియం భరోసా ఇచ్చారు.