తీవ్ర భావోద్వేగానికి గురైన స్మిత్‌

SMITH
SMITH

సిడ్నీః బాల్ ట్యాంపరింగ్ నేరానికి గాను ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఈ రోజు సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కంటతడి పెట్టాడు. కెప్టెన్‌గా జరిగిన పరిణామాలకు పూర్తి తనదే బాధ్యత అని, తనను క్షమించాలని అతను కోరాడు. నాయకుడిగా తాను పూర్తిగా విఫలమయ్యానని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతుందంటూ అతను తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా అతను మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు. “నాకు జరిగిన ఈ నష్టం వల్ల ఏదైనా లాభం ఉందంటే…అది ఇతరులకు ఈ ఉదంతం గుణపాఠం కావడమే. ఈ పరిణామం క్రీడా వ్యవస్థలో ఓ మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నా. క్రికెటే నా జీవితం. మైదానంలో మళ్లీ త్వరగా అడుగుపెట్టాలని కోరుకుంటున్నా” అంటూ స్మిత్ కన్నీటిపర్యంతమయ్యాడు.