తీవ్రవాదానికి వ్యతిరేకంగా డిక్లరేషన్‌

Brics Summit
Brics Summit

బీజింగ్‌: చైనాలోని గ్జియామెన్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ సమావేశాల్లో ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోది చెప్పిన మాటలకు మిగతా బ్రిక్స్‌ దేశాలు మద్దతునిచ్చాయి. ప్రపంచంలో అలజడి సృష్టిస్తున్న తాలిబాన్‌, అల్‌ఖైదా, ఐసిస్‌ తీవ్రవాద సంస్థలు, వాటి అనుబంధ
సంస్థలు లష్కర్‌-ఎ-తోయిబా, జైషే మహ్మద్‌, హఖ్ఖాని నెట్‌వర్క్‌లు రేపుతున్న విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు వారు ప్రతిపాదించిన డిక్లరేషన్‌లో బ్రిక్స్‌
దేశాలు స్పష్టం చేశారు. అలాగే ఉత్తర కొరియా చేస్తున్న ఆగడాలపై కూడా విచారం వ్యక్తం చేస్తున్నట్లు డిక్లరేషన్‌ పేర్కొంది. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను కట్టడి చేయడానికి ఐక్యరాజ్యసమితి సహాయ సహకారాలు అందించాలని బ్రిక్స్‌ దేశాలు కోరాయి.