తీర్మానంపై ప్ర‌భుత్వం స్పంద‌న‌లేదుః ఎంపీ

avanti srinivas
avanti srinivas

న్యూఢిల్లీః టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కేంద్రం స్పందించడం లేదని ఆ పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ విమర్శించారు. లోక్‌సభ రేపటికి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఐదు రోజులుగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని, సభలో చర్చ జరగకుండా చేయిస్తోందని విమర్శించారు. తమ డిమాండ్ నెరవేరేవరకు తాము అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తామని, పార్లమెంట్ వద్ద ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.